కూకట్‌పల్లిలో హోమో సెక్సువల్స్ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 44 మంది

by  |
Rave party
X

దిశ, కూకట్‌పల్లి: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు పరిమితమైన రేవ్ పార్టీలు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరాయి. కూకట్‌పల్లిలోని ఓ కాలనీ మధ్యలో ఇంటిని అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా, పోలీసులు దాడి చేసి 44 మంది హోమో సెక్సువల్స్‌ను, ఇద్దరు నిర్వాహకులను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద భారీగా మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభ్యం అయ్యాయి. సీఐ నరసింగరావు వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వివేక్ నగర్ కాలనీలోని 6–2/2/ఎఫ్-1 నెంబర్ గల ఇంటిని వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి అద్దెకు తీసుకుని దయాల్ అనే వ్యక్తిని మేనేజర్‌గా నియమించి వారం వారం వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ రేవ్ పార్టీకి వెళ్లడానికి రూ. 300 ఎంట్రీ ఫీజు తీసుకొని లోపలికి అనుమతించారు.

Rave party

లోపలికెళ్లిన తరువాత విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ, హుక్కా కొడుతూ, సెక్స్‌లో పాల్గొంటున్నారన్న సమాచారంతో అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఎస్ఓటీ ఎస్ఐ నరసింహారెడ్డి, కూకట్‌పల్లి పోలీసులతో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పార్టీలో పాల్గొన్న 44 మంది యువకులు పట్టుబడ్డారు. విస్తృతంగా తనిఖీలు చేసిన పోలీసులు రెండు హుక్కా పాట్‌లు, భారీగా మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింగరావు తెలిపారు. అనంతరం పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అంతేగాకుండా.. పార్టీలో హిజ్రాలు ఉన్నట్టు స్థానికులు తెలపగా పోలీసులు మాత్రం హిజ్రాలు లేరని చెప్పడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కాగా, హిజ్రాల సంఘం రాష్ట్ర నాయకురాలు ఒకరు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రేవ్ పార్టీ గురించి వాకబు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం కూకట్‌పల్లి పీఎస్‌కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం.

Vivek-Nagar-Colony

వారం వారం వీకెండ్ పార్టీలు :

ప్రతి వారం దయాల్ అనే వ్యక్తి హుక్కా సప్లయర్ ఇమ్రాన్‌తో కలిసి వీకెండ్‌లో రేవ్ పార్టీ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇళ్లు అద్దెకు తీసుకొని భారీగా డీజే బాక్సులు పెట్టి సౌండ్లు చేస్తూ.. విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఇంట్లోని సౌండ్ బయటికి రాకుండా ఇంట్లో సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీని వినియోగించినట్టు సమాచారం.

స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి :

ప్రతి వారం కాలనీలోకి ఆ ఇంటికి వీకెండ్‌లో చాలామంది రావడం, మద్యం సేవించడం కామన్‌గా మారిందని స్థానికులు చెప్పారు. ఇటీవల భారీగా సౌండ్‌లు పెట్టి ఇబ్బందులకు గురిచేయడంతో ఎస్ఓటీ, కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed