కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. మరో ఇద్దరిపై కాంగ్రెస్ వేటు

by  |
కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. మరో ఇద్దరిపై కాంగ్రెస్ వేటు
X

దిశ, కమలాపూర్: పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న‌ట్లుగా గుర్తించిన క‌మాలాపూర్ కాంగ్రెస్‌ మండ‌ల అధ్య‌క్షుడు బొల్లం రాజిరెడ్డి, నాయ‌కుడు పాక ర‌విల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా అధ్య‌క్షుడు నాయిని రాజేంద‌ర్‌రెడ్డి తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ ఉదంతంలో రాజిరెడ్డి పేరు వినిపించిన విష‌యం తెలిసిందే. పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో టేప్ సోమ‌వారం ఉద‌యం వెలుగులోకి రావ‌డం, ఆ త‌ర్వాత నిముషాల వ్య‌వ‌ధిలోనే పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ కావ‌డం, సాయంత్రం కౌశిక్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయ‌డం చాలా వేగంగా జ‌రిగిపోయాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు క‌మాలాపూర్ వెళ్లిన డీసీసీ అధ్య‌క్షుడు నాయిని క‌మ్యూనిటీ హాల్‌లో పార్టీ శ్రేణుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

పార్టీ వ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతున్న‌ రాజిరెడ్డి, పాక ర‌విల‌ను స‌స్పెండ్ చేస్తున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలోనే హుజురాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలు కాబోతున్నాయ‌ని అన్నారు. టీఆర్ఎస్‌, బీజేపీలు ఇప్పటికే రూ.200కోట్ల వరకు ఖర్చు చేశాయ‌ని, నాయకులను, కార్యకర్తలను సంతలో బర్రెలను, గొర్రెలను కొన్నట్టు కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత మంది నాయకులను నమ్మి మోసపోవడం జరిగిందని అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి నియోజకవర్గంలోనీ నాయకులను, కార్యకర్తలను కలవడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.



Next Story

Most Viewed