తెలంగాణలో పేదలు అప్పులు చేయడం లేదు.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Rajendra Nagar MLA Prakash Goud
X

దిశ‌, గండిపేట్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ.. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజలకు చేరువ చేస్తున్నార‌ని రాజేంద్రన‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్ అన్నారు. సోమ‌వారం గండిపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. గండిపేట్ మండలంలోని బండ్లగూడ‌, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల‌కు చెందిన 80 మంది ల‌బ్ధిదారుల‌కు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల కోసం ఆసరా పింఛన్, రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార‌న్నారు.

గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడపిల్లలకు అన్నగా అండగా ఉండి, కల్యాణలక్ష్మి రూపంలో ఆదుకుంటున్నాడని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌నేదే సీఎం కోరిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ‌ మేయర్ మహేందర్ గౌడ్, నార్సింగి చైర్మన్ రేఖా యాదగిరి, స్థానిక కౌన్సిలర్లు శివారెడ్డి, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ మల్లేశ్, తహసీల్దార్ చంద్రశేఖర్ త‌దిత‌రులు ఉన్నారు.



Next Story

Most Viewed