రూల్స్ బ్రేక్.. వారికి రాజన్న సన్నిధిలో ప్రత్యేక దర్శనం

by  |
రూల్స్ బ్రేక్.. వారికి రాజన్న సన్నిధిలో ప్రత్యేక దర్శనం
X

దిశ, వేములవాడ: పేదోడి దేవుడిగా పేరొందిన రాజన్న క్షేత్రం లో స్వామి వారి దర్శన భాగ్యం పేదొల్లకు లభించడం లేదు. ఎప్పుడు వీఐపీ సేవలో తరించే ఆలయాధికారులు ,లాక్ డౌన్లో ఎంతటి వారికి కూడా స్వామి వారి దర్శనం లేకున్నా వీఐపీకి దర్శనం చేయించి స్వామి భక్తి చాటుకున్నారు. ఈ నెల 12 నుంచి 22 వరకు లాక్ డౌన్ విధించి, తిరిగి 22 నుంచి 30 వరకు లాక్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పార్వతిరాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా మూసివేసి, ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు. కేవలం ఆంతరంగికకంగానే స్వామి వారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)కు చెందిన ఓ ఉన్నతాధికారిని స్వామి వారి దర్శనం చేసుకునేలా అలయాధికారులు వీలు కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించి ఉన్నతాధికారిని ఆలయ ప్రవేశం ఎలా కల్పిస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ లో సామాన్యు డైన, వీఐపీ అయిన ఓకే నిబంధన ఉండగా, దర్శనంకు ఎలా అనుమతి ఇస్తారని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.


ఆలయానికి భద్రత కల్పించాల్సిన అధికారులే…..

రాజన్న ఆలయంకు నిత్యం వేలాది భక్తులు తరలి వస్తుంటారు. ఆలాంటి ఆలయానికి భద్రత కల్పించాల్సిన అధికారులు లాక్ డౌన్లో నిభందనలు తుంగలో తొక్కారు. ఈ సమయంలో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారి స్వామి వారి దర్శనం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. ఆలయ భద్రతా ఏర్పాట్ల పై పర్యవేక్షించకుండా, సివిల్ డ్రెస్లో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న నంది వద్దకు వచ్చి స్వామి వారిని దర్శించు కోవడం పట్ల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆలయాధికారులు దర్శనంకు ఎలా అనుమతి ఇస్తారని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన పై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని భక్తులు,పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed