పబ్ గొడవపై రాహుల్ క్లారిటీ

by  |
పబ్ గొడవపై రాహుల్ క్లారిటీ
X

సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రిజమ్ పబ్‌లో రాహుల్‌పై దాదాపు 10 మంది బీర్ సీసాలతో దాడికి దిగగా… గాయాలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే తనపై దాడి చేసిన నిందితులకు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చాడు రాహుల్. ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు.

అసలు పబ్‌లో ఏం జరిగింది? ఎమ్మెల్యే తమ్ముడు .. రాహుల్‌పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పబ్ క్లోజింగ్ టైంలో ఇన్సిడెంట్ జరగ్గా…. నాతో పబ్‌కు వచ్చిన అమ్మాయిలను కామెంట్ చేస్తేనే తాను వాళ్లను అలా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగానని చెప్పాడు. తర్వాత వాళ్లు వాష్ రూమ్ సైడ్ వెళ్లొచ్చి .. తనకు డ్యాష్ ఇచ్చి డైరెక్ట్ అటాక్ చేశారని చెప్పాడు. బీరు బాటిళ్లతో బాదడం స్టార్ట్ చేశారని వివరించాడు. ఆ టైంలో వాళ్లు పది మంది ఉంటే… నేను ఒక్కడినే ఉన్నానన్నాడు రాహుల్. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డి.. తనపై దాడి చేశాడని… అందుకే వీడియో ఫుటేజీ, సాక్ష్యాలు మాయం చేస్తారనే ముందు జాగ్రత్తగా హాస్పిటల్ నుంచి వచ్చేసి ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు.

పొలికల్ బ్యాగ్రౌండ్ ఉందన్న పొగరుతోనే … ఎవరి మీద అటాక్ చేసినా చెల్లిపోతుందని అనుకుంటున్నారని … కానీ వాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే కాదు రితేశ్ రెడ్డి అండ్ గ్రూప్ ఇంతకు ముందు కూడా చాలా పబ్‌ల్లో ఇలాంటి దాడులకు దిగారని తెలుసుకున్నానని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందని నమ్ముతున్నాను.. న్యాయ శాఖ, పోలీసు యంత్రాంగం తనకు న్యాయం జరిగేలా చూస్తుందనుకుంటున్నానని … కంప్లైంట్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు రాహుల్. నేను కూడా పబ్‌లకు వెళ్తాను కానీ… ఇలా గొడవలు పెట్టుకోనన్న రాహుల్… నా శత్రువుకు ఎంతటి పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా భయపడేది లేదన్నాడు. వాళ్ల నుంచి ప్రమాదం ఉందని.. బడికి, గుడికి వెళ్లకుండా ఎలా ఉంటానని.. నాకు ఇక్కడ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని.. స్వేచ్ఛగానే ఉంటానని చెప్పాడు.

tags : Rahul Sipligunj, Pub, Ritesh Reddy, MLA Rohit Reddy



Next Story

Most Viewed