ఈసారి ఆసీస్ పర్యటన సవాలే: ద్రవిడ్

by  |
ఈసారి ఆసీస్ పర్యటన సవాలే: ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్: 73ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచింది. నాలుగు టెస్టుల మ్యాచ్ సిరీస్‌ను 2-1తో గెలిచి బార్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకుంది. కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లో ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనుంది. గత పర్యటన మాదిరిగా ఈసారి టీమ్ఇండియాకు సులువుగా ఉండదని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు. అప్పుడు ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేరనే విషయం గుర్తు చేస్తున్నాడు. వారిద్దరూ జట్టులో ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని, ఇది టీమ్‌ఇండియాకు పెద్ద సవాల్ అని అన్నాడు. గత సిరీస్‌లో ఆసీస్ బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌కు మధ్య సహకారం లేకుండా పోయింది. ఈసారి మాత్రం అలా జరగదనే అనుకుంటున్నానన్నాడు. అయితే, భారత జట్టును మాత్రం తక్కువగా అంచనా వేయాడాని లేదని, టీమ్‌ఇండియాలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారని, వీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది అక్టోబర్, డిసెంబర్ నెలల్లో భారత జట్టు రెండు దఫాలుగా పర్యటించనుంది.

Next Story

Most Viewed