కార్పొరేట్ లుక్ వచ్చేలా టాస్క్ భవనం ఆధునీకరణ : జిల్లా కలెక్టర్

by Aamani |
కార్పొరేట్ లుక్ వచ్చేలా టాస్క్ భవనం ఆధునీకరణ : జిల్లా కలెక్టర్
X

దిశ,పెద్దపల్లి : కార్పోరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనలను రివైజ్ చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించి టాస్క్ భవనం ఆధునీకరణ ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి టాస్క్ భవన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు కల్పించవలసిన సౌకర్యాలు, గ్లాస్ డోర్, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణ జరగాలని, ఎంట్రన్స్ లో టాస్క్ చిహ్నం తో కూడిన గ్లాస్ డోర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. టాస్క్ భవనం వద్ద దివ్యాంగుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలని, దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్ లు, ర్యాంపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

విద్యుత్ సరఫరాకు సంబంధించిన మంచి నాణ్యతతో కూడిన ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులను వినియోగించాలని, ఫ్లోరింగ్ లుక్ వచ్చే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. టాస్క్ భవనంలో కిటికీల వద్ద గ్లాసెస్, ఏసి, ఫ్యాన్ లు, లైట్ లు, దోమల మెష్ ఏర్పాటు చేయాలని, టాస్క్ భవనం ప్రాంగణాన్ని నిర్దేశించుకొని కాంపౌండ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. కాంపౌండ్ ఫెన్సింగ్ లోపల టాస్క్ భవన ప్రాంగణంలో గార్డెనింగ్, టాయిలెట్ లు ఏర్పాట్లు చేయాలనీ, బయట ఉడెన్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ఉడెన్ టేబుల్స్ శిక్షణా తరగతుల నిర్వహణకు ఉపయోగపడే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. టాస్క్ ప్రాంగణంలో ఉన్న చెట్లను తొలగించకుండా వాటిని వినియోగిస్తూ టాస్క్ భవనాన్ని ఆధునికరించే విధంగా, కొత్త డోర్లు ఏర్పాటు, దివ్యాంగుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించే విధంగా ప్రతిపాదనలు రివైజ్ చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పీఆర్. డి. ఈ. శంకరయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed