విరాట్‌ను రమ్మని తప్పు చేశాను.. సారీ కోహ్లీ భాయ్!

by  |
విరాట్‌ను రమ్మని తప్పు చేశాను.. సారీ కోహ్లీ భాయ్!
X

దిశ, స్పోర్ట్స్ : మైదానంలో జరిగే చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి రావొచ్చు. ఒక్కోసారి అది పొరపాటు చేసిన వారికి కాకుండా ఎదుటి ఆటగాడికి నష్టాన్ని చేయవచ్చు. అలాంటి సంఘటనే అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జరిగింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (74) కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా.. ఈ ఏడాది తొలి శతకం పూర్తి చేసుకునే వైపు దూసుకెళ్తున్నాడు. నాథన్ లయన్ వేసిన ఇన్నింగ్స్ 77వ ఓవర్ చివరి బంతిని రహానే పాయింట్ వైపు కొట్టి పరుగు కోసం కోహ్లీని పిలిచాడు.

కోహ్లీ వెంటనే స్పందించి పరుగెత్తాడు. కానీ రహానే రాకుండా నో నో అని అరిచాడు. అప్పటికే బంతి హాజెల్‌వుడ్ ఆపి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నాథన్ లయన్‌కు అందించాడు. లయన్ వికెట్లను పడగొట్టడంతో కోహ్లీ రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ వైపు దూసుకొని పోతున్న కోహ్లీ ఇలా అనవసరంగా అవుటవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యాడు. తన తప్పును తెలుసుకున్న రహానే వెంటనే కోహ్లీకి సారీ చెప్పాడు. కోహ్లీ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పెవీలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.



Next Story

Most Viewed