థాయ్‌లాండ్ ఓపెన్‌.. పీవీ సింధు ఔట్

81

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి తర్వాత జరుగుతున్న తొలి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు కలిసి రావడం లేదు. ఇప్పటికే సైనా నెహ్వాల్ కరోనా కారణంగా థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆశలన్నీ పీవీ సింధు పైనే పెట్టుకోగా ఆమె తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

తొలి గేమ్‌ను సింధూ 21-16తో గెలుచుకున్నది. ఇక రెండో గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒక దశలో పీవీ సింధు మ్యాచ్ పాయింట్ వరకు వచ్చినా మియా అద్భుతమైన పోరాటం కనబరిచింది. డ్రాప్ షాట్లు, స్మాష్‌లతో పీవీ సింధును ఇబ్బంది పెట్టింది. రెండో గేమ్‌ను 26-24తో మియా గెలుచుకున్నది. ఇక మూడో రౌండ్‌లో మియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. పీవీ సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. చివరకు 16-21, 26-24, 21-13 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్డ్ తొలి రౌండ్‌లోనే సంచలన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే పీవీ సింధుపై విజయం సాధించడం మియాకు ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన కంతఫాన్ వాంగ్చెరన్‌పై 16-21, 10-21 వరుస గేమ్స్‌ కోల్పోయి ఓటమిపాలయ్యాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..