తెలంగాణ తెలుగు తేజం.. పీవీ జయంతి

by  |
తెలంగాణ తెలుగు తేజం.. పీవీ జయంతి
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఈ నిద్రా నిశీధి
మహిత జాగృతిపుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ…. పీవీ

చరిత్రలో ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన వాళ్లు ఉంటారు. కానీ జీవించి ఉన్నా లేకపోయిన చరిత్రలో నిలిచిపోయి తరతరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచే వ్యక్తి తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు. ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతటా పీవీ అనే రెండక్షరాలతో ఆయన సుప్రసిద్ధుడు.

పీవీ ప్రధాని అయ్యాక అనేక సంస్కరణలు తీసుకరావడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. పీవీకి ప్రధాన మంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పీవీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ఆ పీఠం అధిష్టించారు.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశలో పీవీని ప్రధాని పదవి వరించింది. కానీ, ఆ సమయంలో అది ఓ ముళ్ల కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం. దీనికి తోడు చిక్కి శల్యమై చితిపైకి చేరిన ఆర్థిక వ్యవస్థ. కానీ, పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓ వైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే.. మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టారు.

నేడు పీవీ జయంతి కావడంతో హైదరాబాద్ నక్లెస్ రోడ్‌‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉద‌యం 11 గంట‌లకు నగరం నడిబొడ్డున రాష్ట్ర గ‌వ‌ర్నర్ తిమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదిగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖ‌ల‌కు చెందిన మంత్రులు, అధికారులు హాజ‌రుకాబోతున్నారు.

Next Story

Most Viewed