పినపాక నియోజకవర్గం ఇలా ఉండటానికి కారణం రేగా కాంతారావు..

by  |
ajay
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం మండలాలలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహబూబ్‌బాద్ ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా వారు కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలో 2.58 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. మోతే గ్రామంలో 4.50 కోట్లతో రూపాయలతో పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో 3.11 కోట్లరూపాయలతో బయ్యారం నుండి పాతరెడ్డి పాలెం జగ్గారం గ్రామం వరకు నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి రైతులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా పినపాక నియోజకవర్గం అభివృద్ధి చెందిదని ఈ సందర్భంగా తెలియజేశారు. అసెంబ్లీ సమావేశ సమయంలో రేగా నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పి నాతో సంతకం చేయించుకుంటారన్నారు. ఒకప్పుడు కరకగూడెం వచ్చే పరిస్థితి కాదు.. కానీ ఈనాడు ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం ఎమ్మెల్యే రేగా కాంతారావే అని ఈసభ పూర్వకంగా తెలిపారు. ఈక్రమంలోనే రైతులకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుదని తెలియజేశారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, మణుగూరు ఏఎస్పీ శబరీష్, పంచాయతీ రాజ్ సీఈ సుధాకర్ రెడ్డి,గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్,నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story