బీజేపీపై ఫైర్ అయిన పువ్వాడ.. దేశ సంపదను వారికి కట్టబెడుతున్నారంటూ..

by  |
cpi
X

దిశ, ఖమ్మం టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీపీఐ సీనియర్ జాతీయ నాయకులు, మాజీ శాసనసభ, శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు పూనుకుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలకులపై పోరాటాలకు సిద్ధం కావాలని శ్రేణులుకు పిలుపు నిచ్చారు. కమ్యూనిస్టులకు ఉద్యమ సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైన అంతిమ విజయం మాత్రం కమ్యూనిస్టులదేనని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేవారే కమ్యూనిస్టులన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై తిరుగుబాటు తప్పదని పువ్వాడ హెచ్చరించారు. దేశ సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, జాతిని భ్రష్టుపట్టిస్తున్న బీజేపీకి చరమగీతం పాడాల్సిందేన్నారు. కేంద్రానికి ఉండాల్సిన స్వావలంబన లక్షణం బీజేపీ పుణ్యమా అని స్వాహాలంబనగా మారిపోయిందని ధ్వజమెత్తారు.

Next Story