త్వరలోనే సల్మాన్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకంటే ?

by  |
త్వరలోనే సల్మాన్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకంటే ?
X

దిశ, సినిమా : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప : ది రైజ్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇప్పటిదాకా ‘పుష్ప’కు సంబంధించిన ప్రతీ అప్‌‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. పాటలు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక బన్నీ నటించిన సినిమా మొదటిసారి పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుండగా.. బాలీవుడ్‌‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం సల్లూభాయ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ వేదికను వాడుకునేందుకు బన్నీ- సుకుమార్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 15 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రియాలిటీ షోలో బన్నీ కనిపించబోయే ఎపిసోడ్ ఏ రేంజ్‌ రేటింగ్స్ దక్కించుకుంటుందో చూడాల్సిందే.

Next Story

Most Viewed