పంజాబ్‌కు చుక్కలు చూపించారు.. చెన్నై టార్గెట్ 107

by  |
పంజాబ్‌కు చుక్కలు చూపించారు.. చెన్నై టార్గెట్ 107
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 8వ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షారూఖ్ ఖాన్ ఒక్కడే 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మాన్‌లు ఎవ్వరు కూడా 20కి మించి పరుగులు రాబట్టలేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం అవడంతో స్కోరు బోర్డు మందగించింది.

ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (5), మయాంక్ అగర్వాల్ (0), క్రిస్ గేల్ (10), నికోలస్ పూరన్‌ను (0), దీపక్ హుడా (10) పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. దీంతో 26 పరుగులకే పంజాబ్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో వచ్చిన షారూక్ స్కోరు బోర్డును మెల్లగా ముందుకు తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో రిచర్డ్ సన్ (15). లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్ మురుగన్ అశ్విన్ (6) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 87 పరుగులకే 7 వికెట్లు నష్టపోయారు. ఇక చివర్లో షారూఖ్ కూడా పెవిలియన్ చేరక తప్పలేదు. 36 బంతుల్లో 47 పరుగులు చేసిన అతడు 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాది.. క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇదే సమయంలో క్రీజులో మహ్మద్ షమీ (9), రిలే మెరెడిత్ (0) పరుగులతో నాటౌట్‌గా ఉండగా నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. దీంతో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది.

చాహర్ బౌలింగ్ సక్సెస్..

CSK జట్టులో ఫేస్ బౌలర్ దీపక్ చాహర్ పంజాబ్ హార్డ్ హిట్టర్లను సైతం బెంబేలెత్తించాడు. వరుసగా వికెట్లు తీసుకొని ప్రత్యర్థి జట్టును ఒత్తిడికిలోకి నెట్టాడు. 4 ఓవర్లు వేసిన చాహర్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్‌ కూడా ఉండటం విశేషం. ఇక ఇదే జట్టులో సామ్ కర్రన్, మొయిల్ అలీ, బ్రావో తలో వికెట్ తీసుకున్నారు. జడేజా ఒక(కేఎల్ రాహుల్) రనౌట్ చేశాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌ విజయంతో బ్యాక్ టు ఫామ్ అంటారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.


Next Story

Most Viewed