పంజాబ్‌లో మరో రెండు వారాలు

by  |
పంజాబ్‌లో మరో రెండు వారాలు
X

చండీగఢ్: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3 (తెలంగాణలో 7) వరకు విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు పొడిగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎత్తివేయాలని సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండగానే తమ రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. పంజాబ్‌లో మే 17 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 17 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7-11గంటల వరకు సడలింపులిస్తామని చెప్పారు. అలాగే, పరిశ్రమలకూ అనుమతినిస్తామనీ, అయితే తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కాగా, కంటైన్మెంట్ జోన్లు, హాట్ స్పాట్‌లలో మాత్రం ఎలాంటి సడలింపులూ ఉండవన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: punjab extends curfew, corona, lockdown, punjab cm, amarinder singh, curfew

Next Story