ఫిట్‌నెస్‌పై అవగాహన‌కు పుదుచ్చేరి మ్యాన్ అండర్‌వాటర్ ఫీట్

by  |
ఫిట్‌నెస్‌పై అవగాహన‌కు పుదుచ్చేరి మ్యాన్ అండర్‌వాటర్ ఫీట్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత పాండెమిక్ సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలాను, దాని ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తి నీటి అడుగున వ్యాయామం చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక జర్నలిస్ట్ ప్రమోద్ మాధవ్ తాజాగా తన ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు.

పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తి సముద్రంలో డైవ్ చేసి 14 మీటర్ల నీటి అడుగున డంబెల్ ఎత్తడంతో పాటు, బార్బెల్ కర్ల్స్ చేసి ఔరా అనిపించాడు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నఈ సమయంలోవ్యాయామం చేయాల్సిన అవసరాన్ని అవగాహన కల్పించడానికి ఈ ఫీట్ చేశాడు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు, హ్యాపీ హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఇవి మానసిక స్థితిని పెంచడంతో పాటు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతాయి. వాటితో పాటు డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు కూడా విడుదలై మన ఫోకస్, అటెన్షన్‌ లెవెల్స్ పెంచుతాయి. అంతేకాకుండా మానసికంగా బలమైన విశ్వాసం కలిగి ఉంటారు.
– ఉత్సవ్ ఘోష్, ఫిట్‌నెస్ ట్రైనర్, ఫౌండర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ గుడ్

Next Story

Most Viewed