చక్రవడ్డీ మాఫీతో ప్రభుత్వ బ్యాంకులపై రూ. 2 వేల కోట్ల భారం

by  |
చక్రవడ్డీ మాఫీతో ప్రభుత్వ బ్యాంకులపై రూ. 2 వేల కోట్ల భారం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణాలపై మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ. 1,800 నుంచి రూ. 2,000 కోట్ల వరకు భారం ఉంటుందని అంచనా. ఈ మేరకు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం గతేడాది మార్చి నుంచి ఆగష్టు మధ్య మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. ఇదివరకే దీన్ని వసూలు చేసి ఉంటే గనక తిరిగి చెల్లించాలని కోర్టు సూచించింది.

తర్వాతి వాయిదాల్లో అయినా వాటిని ఇవ్వాలని స్పష్టం చేయగా, రూ. 2 కోట్లకు పైగా తీసుకున్న రుణాలకు వర్తించేలా తీర్పును వెలువరించింది. ఆ మొత్తం కంటే తక్కువ రుణాలకు గతేడాదే ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో మొత్తం రూ. 5,500 కోట్ల భారం పడినట్లు అయిందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రుణాలను తీసుకున్న వారిలో మొదట 60 శాతం మంది మారటోరియం ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అది 40 శాతానికి తగ్గింది. అయితే, లాక్‌డౌన్ వల్ల తిరిగి చెల్లించడంలో వృద్ధి మెరుగవలేదు. ఇక, కార్పొరేట్ రుణాల్లో 25 శాతం మాత్రమే మారటోరియం ఎంచుకున్నారు.

Next Story

Most Viewed