ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల నిరర్ధక రుణాలు పెరుగుతాయి!

by  |
ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల నిరర్ధక రుణాలు పెరుగుతాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంకుల నిరర్ధక రుణాలు 2 శాతం నుంచి 4 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వంపై 15 బిలియన్ డాలర్ల రీక్యాపిటలైజేషన్ ఒత్తిడి పెరుగుతుందని సంస్థ అభిప్రాయపడింది. పన్ను వసూళ్లు తగ్గిపోవడం, ఉద్దీపన ఖర్చులు అధికమవడం, నికర ఆర్థిక లోటు లక్ష్యం 2 శాతం వరకూ పెరిగే అవకాశముందని తెలిపింది. రీక్యాపిటలైజేషన్ కోసం వనరులను పెంచేందుకు పలు మార్గాలను అన్వేషించాలని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ బ్యాంకులకు సాయం చేయడానికి రీక్యాపిటలైజేషన్ బాండ్‌లను జారీ చేయడం, ఆర్‌బీఐ వద్దనున్న 127 డాలర్ల భారీ నిల్వలను పునర్వినియోగించవచ్చని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కొనసాగుతుండటంతో బ్యాంకుల స్థూల నిరర్ధక రుణాలు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిరర్ధక రుణాలు గనక 2 శాతం నుంచి 4 శాతం వరకూ పెరిగితే బ్యాంకులకు 15 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని, దీనికి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల్లోకి మూలధనాన్ని చొప్పించడం, రీక్యాపిటలైజేషన్ బాండ్‌లను జారీ చేయడం వంటి చర్యలతో నిధులు సమకూరతాయి. మూలధనం అందిన తర్వాత ప్రభుత్వ యాజమాన్య బ్యాంకులు రీక్యాపిటలైజేషన్ బాండ్‌లలో పెట్టుబడులను పెట్టడానికి ఆస్కారం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా వివరించింది. మూలధన అవసరాలు తీరిన అనంతరం బ్యాంకులు కోలుకుంటాయి. అప్పుడు ప్రభుత్వం క్రమంగా రీక్యాపిటలైజేషన్ బాండ్‌లను సాధారణ ప్రభుత్వ భద్రత కింద మార్చుకుని మార్కెట్లలో విక్రయించవచ్చు. బాండ్‌లను జారీ చేయడం ద్వారా కేంద్రానికి ఆర్థిక లోటు పెరుగుతుంది. అయినా సరే, రీక్యాపిటలైజేషన్ బాండ్‌లు ఉన్న ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల నుంచి లాభాలను బదిలీ చేయడం ద్వారా కొంత నియంత్రించబడుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడించింది.

Tags PSB NPAs, Recapitalisation, RBI, Bonds, Banking



Next Story

Most Viewed