సైనిక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మయన్మార్

by  |
సైనిక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మయన్మార్
X

యాంగోన్ : మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును నిరసిస్తూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ సహా దేశ నాయకులను విడుదల చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. బుధవారం వేల మంది నిరసనకాలు సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగోన్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాల వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు. ఎంతోకాలం సైనిక పాలనలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఇకపై దానిని అంతం చేయాల్సిన అవసరం ఉంది.

మాకు నిజమైన ప్రజాస్వామ్యం కావాలి. దేశంలో సుదీర్ఘకాలం సైనిక పాలనను కొనసాగించాలని ఉద్యమకారులు పేర్కొన్నారు. మరోవైపు నిరసనలకు కేంద్రమైన యాంగోన్‌కు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంపై ఐక్యారాజ్యసమితి స్పందించింది. సైనిక మోహరింపు పెద్ద ఎత్తున హింసకు చెలరేగే అవకాశం ఉందని యూఎన్‌ఓ ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూవ్ హెచ్చరించారు.



Next Story

Most Viewed