వెబ్ హ్యాకథాన్ విజేతలను ప్రకటించిన ప్రొగ్రెస్ సంస్థ

by  |
progress 1
X

దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్ అప్లికేషన్ల అభివృద్ధి, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీలను అందించే ప్రముఖ ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ తన గ్లోబల్ హ్యాకథాన్ ది వర్తీ వెబ్ విజేతలను ప్రకటించింది. ఆరు వారాల పాటు ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పోటీలో మొత్తం 83 దేశాల నుంచి 1,200 మంది 52 ప్రాజెక్టులను సమర్పించారని కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి మే 24 మధ్య ఈ పోటీ కోసం డెవలపర్లు మెరుగైన అప్లికేషన్లను రూపొందించాలని కంపెనీ ప్రకటించింది. ఈ పోటీలో మొత్తం 40 వేల డాలర్లు(సుమారు రూ. 30 లక్షలు) నగదు, బహుమతుల కోసం డెవలపర్లు పోటీపడ్డారు.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ కంటే మెరుగైన అప్లికేషన్ల కోసం మేము ఈ పోటీ నిర్వహించాం. పోటీలో వచ్చిన అప్లికేషన్లు ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి. విజేతలుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. డెవలపర్లు ఇచ్చిన అప్లికేషన్లు త్వరలో అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్టు’ ప్రొగ్రెస్ డెవలపర్ రిలేషన్స్ సీనియర్ డైరెక్టర్ సారా ఫాట్జ్ అన్నారు. హ్యాకథాన్ విజేతలు.. బ్లేజర్, ఆంగులర్, కిట్, రిపోర్టింగ్ టూల్, ఎవెరీవేర్ టూల్ సహా ఇతర అప్లికేషన్లు ఉన్నాయి. తమకు అందించిన మొత్తం 52 ప్రాజెక్టులను తొమ్మిది విభాగాలుగా విభజించబడ్డాయని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed