ఆ ఖైదీలకు విముక్తి కల్పించాలి : ప్రొఫెసర్ ఖాసీం

by  |
ఆ ఖైదీలకు విముక్తి కల్పించాలి : ప్రొఫెసర్ ఖాసీం
X

దిశ, గజ్వేల్: సాధారణ ఖైదీలుగా జైలు జీవితం అనుభవిస్తున్న 600 మంది ఖైదీలకు వెంటనే విముక్తి కల్పించి, వారి కుటుంబాలకు అండగా ఉండాలని ప్రొఫెసర్ ఖాసీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ప్రొఫెసర్ ఖాసీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఖాసీం ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు పొలీస్ స్టేషన్‌కు వచ్చారు.

తనకు బెయిలు వచ్చేందుకు కృషి చేసిన నాయకులకు, విద్యార్థి సంఘాలకు, ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట కోర్టు ఆదేశాల ప్రకారం… తాను 3 నెలలు ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్‌కు హాజరు కావటం జరిగిందని, అది నేటితో పూర్తి అయ్యిందని ప్రొఫెసర్ కాశీం తెలిపారు. జైల్లో సాధారణ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక జీవో ద్వారా విడుదల చేయాలని కోరారు.


Next Story