అశ్వనీదత్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ….

by  |
అశ్వనీదత్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ….
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. భూ సేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. కాగా వాదనలు విన్న కోర్టు… దీనిపై ఫైనల్ కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏకు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.

కాగా గన్నవరం ఏయిర్ పోర్టు విస్తరణ కోసం ఆయన తన 39 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి ఇచ్చినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి బదులుగా అంతే విలువగల భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం ఆయనకు హామి ఇచ్చినట్టు పిటిషన్ లో తెలిపారు. కాగా ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ భూమి విలువ గణనీయంగా పడిపోయిందనీ తెలిపారు. దీంతో భూసేకరణ చట్టం 2013 ప్రకారం తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed