విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు.. దానికోసమేనా ?

by  |
విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు.. దానికోసమేనా ?
X

దిశ, ఏపీ బ్యూరో: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనను అమలు చేసేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రంగంలోకి దిగారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు వచ్చాయి. మీ పిల్లల హాజరు 75శాతం ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుల లేఖలో విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ లేఖలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి.


Next Story