ఆ హోదాలన్నీ త్యజించిన హ్యారీ

by  |
ఆ హోదాలన్నీ త్యజించిన హ్యారీ
X

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌లు తిరిగి రాజరిక కుటుంబ బాధ్యతలు తీసుకోవడం లేదు. హ్యారీ గౌరవ హోదాలన్నింటినీ త్యజించినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ తాజాగా ధ్రువీకరించింది. వారి వైవాహిక జీవితంలో అనేక చొరబాట్లు జరుగుతున్నాయని, శ్వేతజాతి అహంకార ఘటనలు జరిగాయని పేర్కొంటూ హ్యారీ, మేఘన్‌లు 2020 నుంచి రాజకుటుంబానికి వేరుగా జీవిస్తున్నారు. అయితే, ఈ ఎడబాటుపై ఏడాది తర్వాత పున:సమీక్షిస్తామని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది.

తాజాగా, హ్యారీ, మేఘన్‌లు రాజకుటుంబ బాధ్యతలకు దూరంగా ఉంటారని నిశ్చయించుకున్నట్టు తెలిపింది. ఫలితంగా, హ్యారీ తన గౌరవ హోదాలన్నీ కోల్పోనున్నారని వివరించింది. ఆ హోదాలన్నీ క్వీన్ ఎలిజబెత్-2కు వెనక్కి వస్తాయని, తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు అందిస్తారని తెలిపింది. హ్యారీతో క్వీన్ ఎలిజబెత్-2 మాట్లాడి ధ్రువీకరించారని వెల్లడించింది. రాజకుటుంబం నుంచి విడివడి ప్రస్తుతం హ్యారీ, మేఘన్‌లు అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో నివసిస్తున్నారు.

Next Story

Most Viewed