స్వాతంత్ర వేడుకల్లో మోడీ కీలక సందేశం.. వారే మనకు స్ఫూర్తి

by  |
modi speech
X

దిశ, న్యూ ఢిల్లీ: దేశ విభజన గాయం నేటికీ ప్రజలందరినీ వెంటాడుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని, గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయన్నారు. విభజన సమయంలో భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్‌ 14 విభజన భయానక జ్ఞాపకాల దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆదివారం ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోందన్నారు.

మీ స్పూర్తి దార్శనీయం..

టోక్యో ఒలిపింక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేసిన పోరాటం అసమానమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అన్నారు. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తు వారికి గౌరవం ప్రకటిస్తోందన్నారు. వాళ్లు పతకాలు మాత్రమే సాధించలేదు.. నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

Next Story

Most Viewed