జీతం, ఖర్చులు తగ్గించుకున్న ‘ఫస్ట్ సిటిజన్’

by  |
జీతం, ఖర్చులు తగ్గించుకున్న ‘ఫస్ట్ సిటిజన్’
X

న్యూఢిల్లీ: ఫస్ట్ సిటిజన్ ఫస్ట్ క్లాస్ డెసిసెన్ తీసుకున్నారు. కరోనాపై పోరుకు తనదైన స్డైల్‌లో చేయూతనిచ్చారు. కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం ఏడాదిపాటు తన వేతనంలో 30 శాతం కోత విధించుకున్నారు. అంతేకాదు, దేశీయంగా పర్యటనలు, ఫుడ్ మెనూ, కార్యక్రమాలను తగ్గించుకోనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రజలకు అందుబాటులో ఉండేందుకుగాను టెక్నాలజీని వినియోగించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలు, వేడుకలకు ఖర్చును తగ్గించుకోవాలని, అతిథుల సంఖ్యను కుదించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ చర్యలతో రాష్ట్రపతి భవన్‌కు కేటాయించే బడ్జెట్‌లో 20 శాత తగ్గుతుందని వివరించింది.

Next Story

Most Viewed