కరీంనగర్‌లో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

by  |
కరీంనగర్‌లో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
X

దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతాంగాన్ని నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట కాస్తా వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఉందనీ, గోనె సంచులు లేవనీ, తరుగు ఎక్కువ తీస్తామన్న కారణాలను అధికారులు చూపడంతో రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోయారు. దీంతో అకాల వర్షంతో కోసిన పంట నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. అధికారులు టోకెన్ సిస్టం అమలు చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని ఆరోపిస్తున్నారు. కరీంనగర్, హుజురాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన వర్షం వల్ల చేతికొచ్చిన పంట మొత్తం తడిసిపోయింది. దీంతో గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. మరోవైపు అమ్మేందుకు ఆరబెట్టిన మొక్కజొన్న కూడా వర్షానికి తడిసిపోయిందని మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: Premature, rain, Karimnagar, Stained grain, farmers, Token System



Next Story

Most Viewed