ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. ఆ టాబ్లెట్ వేసుకున్నందుకే చనిపోయిందా..?

by  |
noushik begam
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంజల్ రెడ్డి మెమోరియల్ ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణీ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన నౌశిక్ బేగం(23) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ పరీక్షల నిమిత్తం అంజల్ రెడ్డి మెమోరియల్ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు బీపీ ఎక్కువగా ఉండటంతో వైద్యులు టాబ్లెట్స్ ఇచ్చారు. కాసేపటికి నౌశిక్ మృతి చెందింది. దాంతో వైద్యులు నిర్లక్ష్యం వహించి బీపీ టాబ్లెట్ లు ఇవ్వడం కారణంగానే నౌశిక్ మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆస్పత్రికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతురాలి బంధువులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మృతిరాలి కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. హాస్పిటల్ యజమాన్యం మృతురాలి పట్ల బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పడంతో బంధువులు శాంతించారు. తమకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు.

ఈ విషయమై ఆస్పత్రి వైద్యురాలు డా. సరితారెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల నుంచి నౌశిక్ తమ వద్దే పరీక్షలు నిర్వహించుకుందన్నారు. శుక్రవారం తలనొప్పితో వస్తే బీపీ టాబ్లెట్స్ ఇచ్చి పంపించామని చెప్పారు. శనివారం ఆస్పత్రికి వచ్చే సరికే నౌశిక్ మృతి చెందిందని తెలిపారు.


Next Story

Most Viewed