ప్లాస్మా డొనేషన్‌పై ప్రణీత స్పెషల్ డ్రైవ్

by  |
ప్లాస్మా డొనేషన్‌పై ప్రణీత స్పెషల్ డ్రైవ్
X

దిశ, సినిమా : దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య జనాలకు హెల్ప్ చేసేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. విరాళాలు ఇవ్వడంతో పాటు మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సోషల్ మీడియా వేదికగా అవేర్‌నెస్ పెంచే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రణీత సుభాష్.. ప్లాస్మా డొనేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. కొవిడ్ నుంచి రికవరీ అయి నాలుగు వారాల నుంచి ఆరు నెలల సమయం దాటితే.. ప్లాస్మా డొనేట్ చేయాలని కోరింది. 18-65 ఏజ్ గ్రూప్‌లో ఉన్నవారు ఇందుకు అర్హులని, ప్లాస్మా దానం చేసి మరిన్ని జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సేవా భారతి సంస్థలు చేపట్టిన ప్లాస్మా డోనర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ గురించి అవగాహన కల్పించిన ప్రణీత.. బాధ్యతగా ఉండాలని కోరింది.

Next Story

Most Viewed