రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక అయిన డిండి విద్యార్థిని..

by  |
pranava
X

దిశ, డిండి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కాలేజీకి చెందిన ఈటూరు ప్రణవ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో చదువుతున్న ప్రణవ చిన్నప్పటినుండే చదువులో చురుకుగా ఉండేది. సమాజానికి ఉపయోగపడే ఏదో ఒకటి కనుగొని తన ప్రత్యేకతను చాటాలనుకునేది. ఈ క్రమంలో అంధులు ఒకరి సహాయం లేకుండా వారంతట వారే నడిచేందుకు ఉపయోగపడే గైడింగ్ స్పెక్టికల్స్ ను తయారు చేసింది. ఈ గైడింగ్ స్పెక్టికల్స్ గతంలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది.

దీంతో గైడింగ్ స్పెక్టికల్స్ ను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కర్ణాకర్, అధ్యాపక సిబ్బంది అభినందించారు. తాను రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తాను తయారుచేస్తున్న గైడింగ్ స్పెక్టికల్స్ అంధులకు ఉపయోగపడేలా చేయడమే నా ముందున్న లక్ష్యం అని, ప్రభుత్వం లేదా దాతల సహకారం అందిస్తే దాన్ని మరింత మెరుగుపరుస్తానని ప్రణవ పేర్కొంది.


Next Story

Most Viewed