రుణాలు తీసుకురావడంపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

by  |
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున బసవ ప్రభుపాటిల్, యలమంజుల బాలాజీలు వాదనలు వినిపించారు. రిజర్వుబ్యాంక్, కాగ్, మరో ఐదు బ్యాంక్‌లను ఇంప్లీడ్ చేయాలని అభ్యర్థించారు. అయితే కావాలనే జాప్యం చేసేందుకే పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బ్యాంకులు, కాగ్, కేంద్రాన్ని పార్టీలుగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు నాలుగు వారాల గడువు కావాలని దవే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.


Next Story

Most Viewed