రాజకీయ బంద్ విఫలమైంది: బండి సంజయ్

by Shyam |
రాజకీయ బంద్ విఫలమైంది: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీ పిలుపు మేరకు జరిగిన రాజకీయ బంద్​ విఫలమైందని, ప్రజలు, రైతులు మద్దతు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. భారత్ బంద్‌లో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నేతలు బంద్‌ చేశారని ఆరోపించారు. దేశంలో రైతులు లేని బంద్‌ జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసినా, నిరసన తెలిపినా వెంటనే అరెస్టు చేస్తారు.. ఈరోజు ఎందుకు అరెస్టు చేయలేదు డీజీపీ గారూ, ఎందరిని అరెస్టు చేశారో చెప్పాలి. ఎంతమంది మంత్రులను, ఎమ్మెల్యేలను హౌజ్​ అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ప్రజలను ఇబ్బందికి గురిచేసే బంద్​ చేస్తుంటే పోలీసులు వారికే రక్షణ కల్పించారని ఆరోపించారు. మేం పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. కొందరు పోలీసులు అనుసరిస్తున్న పద్ధతికే వ్యతిరేకమన్నారు. జయప్రకాశ్​ నారాయణ వంటి మేధావులు వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నారని గుర్తుచేశారు.

Advertisement

Next Story