Rahul Gandhi : భారతమాతను హత్య చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Rahul Gandhi : భారతమాతను హత్య చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై రెండోరోజు లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అడ్డుపడుతున్నారు. ‘‘మీకు రాజనీతి లేదు.. మీరు హిందూస్థాన్‌ను హత్య చేశారు.. కేవలం మణిపూర్‌నే కాదు.. మొత్తం హిందూస్థాన్‌ను నాశనం చేస్తున్నారు’’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల తాను మణిపూర్ వెళ్లినట్లు తెలిపారు. అక్కడ పరిస్థితిని చూసి కన్నీరు వచ్చిందని అన్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోడీ ఇప్పటివరకు మణిపూర్‌ను సందర్శించలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. మణిపూర్ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో తాను మాట్లాడానని.. వారికి మద్దతుగా రాత్రంతా వారితో గడిపినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ జోడో యాత్రలో అహంకారంతో దేశాన్ని చూడాలనుకున్నాను.. కానీ, అడుగడుగునా పేదల కష్టాలు కనిపించాయని, అవే తనను ముందుకు నడిపించాయని అన్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ తనతో కలిసి నడిచారని అన్నారు. మన ఆలోచనలు పక్కనబెడితేనే ప్రజల బాధలు అర్ధం చేసుకోగలుగుతామని అభిప్రాయపడ్డారు. అహంకారం, దేశాన్ని పక్కన బెడితేనే భారత్ మాట వినగలం అన్నారు. తాను పాదయాత్ర ప్రారంభించినట్లు సంపూర్ణ అవగాహన లేదు.. కానీ, క్రమంగా తెలుసుకున్న అంశాలు, సమస్యలే తనను ముందుకు నడిపించాయని అన్నారు.

సకాలంలో కేంద్రం స్పందించి ఉంటే.. సరైన సమయంలో సైన్యాన్ని అక్కడికి పంపించి ఉంటే ఒక్కరోజులో పరిస్థితిని కంట్రోల్ చేసేది అని అన్నారు. కానీ, మీరు దేశాన్ని రక్షించే వారు కాదు.. హంతకులు అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మణిపూర్ మాట వినేందుకు ఇష్టపడలేదని అనుమానం వ్యక్తం చేశారు. రావణుడు కేవలం మేఘనాథ్, కుంభకర్ణుడి మాటలే వినేవాడు.. మోడీ కూడా రావణుడి లాగే ఇద్దరి మాటలే వింటున్నాడని ఎద్దేవా చేశారు. మోడీ అమిత్ షా, అదానీ కంట్రోల్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రావణుడి అహంకారమే లంకను నాశనం చేసిందని, ఇప్పుడు కూడా మోడీ అహంకారమే దేశాన్ని నాశనం చేస్తోందని అన్నారు.

Read More : తుగ్లక్ లేన్‌లో తన ఇంటిని తిరిగి పొందిన రాహుల్ గాంధీ.

Next Story

Most Viewed