పంచాయతీల సొమ్ము లాక్కున్నారు.. నారా లోకేష్

by Dishafeatures2 |
పంచాయతీల సొమ్ము లాక్కున్నారు.. నారా లోకేష్
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ పంచాయతీలను జగన్​ సర్కారు నిర్వీర్యం చేసింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సుమారు రూ.9 వేల కోట్లను లాక్కున్నారు. వట్టిపోయిన పంచాయతీల్లో నిధుల్లేక మౌలిక సదుపాయాల కల్పన కొరత ఏర్పడింది. ఇప్పటికీ టీడీపీ హాయంలో వేసిన సీసీ రోడ్లు, మురుగు కాలవలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం గ్రామాలను మురికి కూపాలుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ వెల్లడించారు. లోకేష్​ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పూర్తి చేసుకొని మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సరిహద్దులోని లక్ష్మీపురం, నూజెండ్ల, గుర్రపు నాయుడు పాలెం గ్రామస్తులు లోకేష్​ను కలిసి గ్రామాల్లో తాగునీరు, పారిశుద్యం, రోడ్ల స్థితిగతుల గురించి వివరించారు.

పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​ ధరలతోపాటు కరెంటు చార్జీలు షాక్​ కొడుతున్నాయని చెప్పారు. దీనిపై లోకేష్​ స్పందిస్తూ టీడీపీ అధికారానికి కరెంటు చార్జీలతోపాటు ఆయిల్​ రేట్లు తగ్గిస్తామని హామీనిచ్చారు. వాటర్​ గ్రిడ్​ ఏర్పాటు చేసి ప్రతీ గ్రామానికి తాగునీరందిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. యువగళం​ పాదయాత్ర ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న చోట లోకేష్​కు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వినుకొండ ఇన్​చార్జి జీవీ ఆంజనేయులు, సత్తెనపల్లి ఇన్​చార్జి కన్నా లక్ష్మీ నారాయణ, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ నరేంద్ర, జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావుతోపాటు పలువురు టీడీపీ సీనియర్​ నేతలు లోకేష్​ను సాదరంగా ఆహ్వానించారు.


Next Story

Most Viewed