రాజకీయాల్లోకి మరో ప్రముఖ హీరో.. తెర వెనుక చక్రం తిప్పుతోన్న లేడీ MP..?

by Disha Web Desk 19 |
రాజకీయాల్లోకి మరో ప్రముఖ హీరో.. తెర వెనుక చక్రం తిప్పుతోన్న లేడీ MP..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కర్ణాటలకో మరో రెండు నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. ఈ సారి పాలన పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీల మధ్య కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కన్నడ హీరో సుదీప్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ హల్ చల్ చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడని ఈ మేరకు కన్నడ నటి, కాంగ్రెస్ ఎంపీ రమ్య చర్చలు సాగిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల సుదీప్ ఎంపీ రమ్యతో భేటీ అయ్యారని.. ఈ మీటింగ్ వెనుక సుదీప్ పొలిటికల్ ఎంట్రీ, ఆయన పోటీ చేయబోయే సీటు గురించి చర్చ జరిగినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త సీరియస్‌గా పని చేస్తే అధికారం మనదే అని కాన్సెప్ట్‌లో కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముకులను పార్టీవైపు ఆకర్షించే పనిని కన్నడ క్వీన్ రమ్యకు అప్పగించారని అందులో భాగంగానే ఆమె సుదీప్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది. సుదీప్‌నే కాంగ్రెస్ ఎంచుకోవడం వెనుక మరో కోణం కూడా ఉందనేచర్చ జరుగుతోంది.

ఇటీవల కర్ణాటకలో ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పెంచుతూ బొమ్మై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ సామాజిక వర్గం కమలం పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన సుదీప్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ వర్గం ఓటర్లను తమ వైపు మళ్లించుకోవచ్చనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. అన్ని సజావుగా జరిగితే సుదీప్‌ను అసెంబ్లీ స్థానానికి పోటీకి దింపేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అయితే ఈ ప్రచారంపై సుదీప్ ఇంకా స్పందించలేదు. 2018లో సుదీప్ జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దిరామయ్యతో పాటు కాంగ్రెస్ ఎంపీ రమ్యతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనూ సుదీప్ రాజకీయ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తాను రాజకీయాల్లోకి రావడం లేదని అప్పట్లో సుదీప్ ఖండించారు. అయితే మరో రెండు మూడు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సుదీప్ తో ఎంపీ రమ్య భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ సారి సుదీప్ మనసు మార్చుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. కాగా, సుదీప్ విషయంలో ఏం జరగబోతోందని అనేది కాలమే నిర్ణయించనుంది.

READ MORE

Dhamaka OTT: .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?



Next Story