పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు.. రాష్ట్రంలో 144 సెక్షన్ ఎప్పటి వరకు అంటే..?

by Rajesh |
పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు.. రాష్ట్రంలో 144 సెక్షన్ ఎప్పటి వరకు అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయి. ఎన్నికల విధుల్లో 60 వేల మంది రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో మొత్తం 2.94 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 వేల మందితో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండనుంది.

Next Story

Most Viewed