స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిశీలించిన బండి సంజయ్

by Disha Web Desk 2 |
స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిశీలించిన బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్వప్న లోక్ కాంప్లెక్స్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి ఆపై తూతూ మంత్రంగా చర్యలకే పరిమితమవుతోందని, శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శలు చేశారు. దొంగసార కేసులో కవిత ఇరుక్కుంటే రాష్ట్ర మంత్రి వర్గమంతా అక్కడికి వెళ్ళిందని, ఫైర్ యాక్సిడెంట్, పేపర్ లీకేజీ అంశాలను కూడా వారు పట్టించుకున్న పాపాన పోలేదని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తిగా విచారణ జరిపి ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు.



Next Story

Most Viewed