వివాదంలో హెల్త్ డైరెక్టర్.. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీరియస్?

by Disha Web Desk |
వివాదంలో హెల్త్ డైరెక్టర్.. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీరియస్?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తోన్నాయి. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సమయం, సందర్భం ఏదైనా సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తడం.. కాళ్లు మొక్కడం.. ప్రభుత్వ పనితీరును అతిగా ప్రశంసించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మంత్రి హరీశ్ రావును పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి మరెక్కడా జరగలేదన్నట్లు మాట్లాడారు. సిద్దిపేటలో చేసిన అభివృద్ధి కొత్తగూడెంలో 50 శాతం చేసినా నియోజకవర్గం డెవలప్ మెంట్ అవుతుందని హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కామెంట్స్‌పై అటు మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారనే టాక్ ఆ పార్టీ నేతలు వచ్చిందట. సిద్దిపేటలో తప్పితే మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడా అభివృద్ధి చేయలేదా..? ఫండ్స్ తీసుకురాలేదా..? అని పార్టీ కేడర్‌లో చర్చకు దారి తీసిందట. అభిమానం ఉంటే చాటుకోవాలి కానీ ఒకరిని కించపరుస్తూ మరొకరిని పొగడటం ఉంటని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కామెంట్స్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా నాగేశ్వర్ రావు వర్గీయులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కొత్తగూడెంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదా..? లేక చేసిన డెవలప్ మెంట్స్ హెల్త్ డైరెక్టర్‌కు కనిపించడం లేదా..? అని ఫైర్ అవుతున్నారని సమాచారం. నీ స్వలాభం కోసం ఇంకొకరిని బలి చేస్తావా అంటూ మండిపడుతున్నారట. ఎమ్మెల్యే సీటో.. ఎమ్మెల్సీ సీటో కావాలంటే సీఎం దగ్గరకు వెళ్లాలని కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అభివృద్ధిని కించపరుస్తావా అంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్యలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.



Next Story

Most Viewed