AP Political News: ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం చేయలేదంటే కారణం ఇదే.. అంబటి

by Disha Web Desk 3 |
AP Political News: ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం చేయలేదంటే కారణం ఇదే.. అంబటి
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతలు ఓ వైపు ప్రత్యర్థులపై విమర్శల శంఖం మోగిస్తూనే మరో వైపు తమని తాము సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓ వైపు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు తాము నెరవేర్చిన హామీల గురించి వివరిస్తూ.. అమలు చెయ్యని హామీలను ఎదుకు అమలు చెయ్యలేదో చెప్తూ తమని తాము సమర్ధించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చినట్లు పేర్కొన్నారు. కేవలం 2% హామీలు నెరవేర్చలేక పోయామన్నారు. ఇక నెరవేర్చని హామీల్లో మద్యపాన నిషేధం కూడా ఒకటని తెలిపారు. అయితే తాము మద్యపానాన్ని ఎందుకు నిషేధించలేదో కారణం చెప్పారు. రాష్టంలో ఒక్కసారిగా మద్యపానం పై నిషేధం విధిస్తే పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా కొనుగోలు చేస్తారనే ఉద్దేశముతో తాము మద్యపానాన్ని నిషేధించలేదు అని తెలిపారు. కానీ తమకు ఇప్పటికీ మద్యపాన నిషేధం చెయ్యాలనే ఉద్దేశం ఉన్నట్లు పేర్కొన్నారు.



Next Story

Most Viewed