AP Politics: టీచర్లకు అండగా ఉంటా.. సుజనా చౌదరి

by Disha Web Desk 3 |
AP Politics: టీచర్లకు అండగా ఉంటా.. సుజనా చౌదరి
X

దిశ, ప్రతినిధి, విజయవాడ : ఈ రోజు (గురువారం) విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా గౌతమ్ స్కూల్‌ని సందర్శించారు. కాగా ఆమెకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లయన్ ఎన్ సూర్యారావు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆమె టీచర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలోని టీచర్లు అందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. భష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. చిట్టినగర్ గౌతమ్ విద్యా సంస్థలను, నియోజకవర్గ టీచర్లందరికి అండగా నిలబడతానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటేనే ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించి, విద్యా వ్యవస్థలో మార్పునకు కృషి చేస్తానన్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన గీతాంజలి, తేజ కుమార్‌ను సుజనా అభినందించారు.

వారి ఉన్నత విద్యకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో విద్యారంగంతో పాటు అన్ని రంగాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. టీచర్ల సంక్షేమం కోసం భవిష్యత్ తరాల ఉన్నతి కోసం ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే సొంత ట్రస్టు ద్వారా వేల మంది విద్యార్థులకు సుజనా ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించి వారి ఉన్నత భవిష్యత్తు కోసం పాటుపడ్డారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా కొనియాడారు.

సుజనాలాంటి నేతను పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా టీచర్ల సమస్యలను పరిష్కరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తోడ్పాటునందిస్తామన్న సుజనాకే తమ మద్దతు ఉంటుందని లయన్ ఎన్ సూర్యారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు బాడిత శంకర్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు, లయన్ ఉపేంద్ర, బీ ఎస్‌కే పట్నాయక్, బెవర జోగేశ్వరరావు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More..

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆ ఫైలుపైనే తొలి సంతకం



Next Story

Most Viewed