కాంట్రాక్టర్‌ను విడిచి.. లేబర్లను శిక్షించిన పోలీసులు

by  |
కాంట్రాక్టర్‌ను విడిచి.. లేబర్లను శిక్షించిన పోలీసులు
X

దిశ, నల్లగొండ: రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భువనగిరి పట్టణంలో 33వ వార్డు విద్యానగర్‌లో హాస్పిటల్‌ నిర్మాణ పనులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటంతో కరోనా వైరస్ ఎక్కువగా సంక్రమించే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ ఇరుగుపొరుగు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున లేబర్‌ను సమీకరించి గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటలర్
నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హాస్పిటల్ యజమాని, సదరు కాంట్రాక్టర్‌ను వదిలివేసి కూలీ పని చేయడానికి వచ్చిన వారిపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. లేబర్‌ను వీధిలోకి తీసుకొచ్చి వారితో గుంజీలు తీయించడంతోపాటు కుప్పి గంతులు వేయించారు. అలా ప్రధాన రహదారి వరకు తీసుకువచ్చారు. కొంతమంది వీటిని వీడియో తీసి వాట్సాప్‌లో వైరల్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన హాస్పిటల్ యజమాని, కాంట్రాక్టర్‌ను వదిలేసి కూలీ పనికి వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

Tags: Police, punished, workers, violating, lockdown, regulations, nalgonda



Next Story

Most Viewed