బిచ్చగాళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు

by  |
బిచ్చగాళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు
X

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బిచ్చగాళ్లపై పోలీసులు దృష్టిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో యాచకులు, నిరాశ్రయులు కరోనా ఆందోళనతో భయబ్రాంతులై ఉన్నారు. వారిని ఆదుకుంటున్నామన్న పేరిట సహాయం చేస్తూ సెల్ఫీలు లేదా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతుండడంతో పోలీసులు వారిపై దృష్టి సారించారు.

దీంతో ప్రధాన పట్టణాల్లోని యాచకులు, నిరాశ్రయులు, అభాగ్యుల కోసం పోలీసులతో పాటు మున్సిపల్‌ కార్పొరేషన్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖాధికారులు రోడ్లపై జల్లెడ పడుతున్నారు. వారికి ఆహారం సమకూర్చే వారి నుంచి వారికి కరోనా సోకే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వారందర్నీ షెల్టర్లకు తరలించే చర్యలు చేపడుతున్నారు.

ఇప్పటికే ఐదు బస్సుల ద్వారా 250మందికి పైగా యాచకులను విజయవాడలోని షెల్టర్‌లకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు విశాఖపట్టణంలో కూడా మున్సిపల్ అధికారులు ఇదే పనిలో ఉన్నారు. ఈ షెల్టర్లలో యాచకులు, నిరాశ్రయులకు వసతితో పాటు భోజన సౌకర్యాలు కూడా చేపట్టనున్నారు.

Tags: andhra pradesh, visakhapatnam, vijayawada, beggars, police, municipal staff



Next Story

Most Viewed