తాడ్వాయిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

by  |
తాడ్వాయిలో కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విషయం తాగి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన హాజీ హైమద్ శుక్రవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటన అలస్యంగా వేలుగు చూసింది. ప్రస్తుతం అతను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా మొదలైనప్పటి నుంచి హాజీ హైమద్ కు గాంధీ ఆస్పత్రి కరోనా విభాగంలో డ్యూటీ వేశారు. కొంపల్లి పరిధిలోని సుచిత్ర వద్ద ఓ అపార్ట్ మెంటులో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గాంధీలో డ్యూటీ కారణంగా భార్యా పిల్లలు నెలన్నరగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని తాడ్వాయి వచ్చిన హాజీ హైమద్.. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ముందుగా తల్లికి ఫోన్ చేసి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. అలా చేయవద్దని, ఎక్కడున్నావో చెప్తే తాను వస్తానని తల్లి అజ్మీరా కొడుకును వేడుకున్న వినిపించుకోలేదు. అయితే ప్రతిసారి కామారెడ్డి వచ్చినప్పుడల్లా తనకు చెప్పేవాడని, కానీ.. నిన్న అతను ఇంటికి వచ్చిన విషయం కూడా తనకు తెలియదని, ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని భార్య గౌసియా చెబుతోంది. అయితే కుటుంబంలో కలహాల కారణంతోనే హాజీ హైమద్ మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. గత కొద్దీ రోజులుగా భార్యా భర్తలు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed