నవోదయ ‘మైగ్రేషన్’ విద్యార్థులు క్షేమం: వినోద్ కుమార్

by  |

దిశ, న్యూస్‌ బ్యూరో: నవోదయ విద్యాకేంద్రాల్లో మైగ్రేషన్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో గురువారం తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఆందోళన వ్యక్తం చేస్తూ కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వినోద్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. స్పందించిన వినోద్ కుమార్ నవోదయ విద్యాసంస్థల రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనసూయ‌తో మాట్లాడారు. విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో, క్షేమంగానే ఉన్నారనీ, విద్యార్థులను ఆయా రాష్ట్రాల అధికారులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ బాధ్యులు తెలిపినట్లు వినోద్ కుమార్ చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదనీ, నిశ్చింతగా ఉండాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు పంపించే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న విషయాన్ని నవోదయ విద్యా సంస్థల అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

Tags:Navodaya Migration students,Planning commission vice Chairman,vinod kumar,parents

Next Story

Most Viewed