ఉన్నత చదువులు పెనుభారం కాకూడదనే….

by  |
ఉన్నత చదువులు పెనుభారం కాకూడదనే….
X

దిశ, పటాన్‌చెరు:
పటాన్‌చెరు పట్టణంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామన్న ఎన్నికల హామీలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో పీజీ కళాశాలను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2020-2021 విద్యా సంవత్సరంలో భాగంగా ఎంఏ ఎకనామిక్స్, ఎం కామ్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం కార్మికులు కర్షకుల పిల్లలే ఉన్నారని అన్నారు. వారికి ఉన్నత చదువులు పెనుభారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో వీటి ఏర్పాటుకు కృషి చేశామన్నారు. పీజీ కళాశాల మంజూరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పీజీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని తెలిపారు.



Next Story