మండుతున్న చమురు ధరలు.!

by  |
మండుతున్న చమురు ధరలు.!
X

దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మళ్లీ మండుతున్నాయి. మరికొద్దిరోజుల్లో ఈ ధరలు మరింత భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. గత 30 రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు బుధవారం 26 పైసలు పెరిగాయి. పెట్రోల్‌తో పాటు డీజిల్ కూడా 25 పైసలు పెరిగింది. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడమే దీనికి కారణమని మార్కెట్లు వర్గాలు తెలిపాయి.

మంగళవరాం విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 5 శాతం పుంజుకోవడంతో 2020, ఫిబ్రవరి తర్వాత ముడిచమురు దహ్రలు గరిష్ఠాలను చేరుకున్నాయి. ఈ ప్రభావం కారణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒపెక్‌తో పాటు రష్యా దేశాలు మూడేళ్లుగా చమురు ఉత్పత్తిలో కోటలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది అమెరికా, చైనా మధ్య వాణిజ్య గొడవలు, ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనం, కరోనా సంక్షోభం పరిణామాలతో చమురు డిమాండ్ ఇటీవల క్షీణ్చింది. దీంతో చమురు ధరలను నియంత్రించాలని ఉత్పత్తి, ఎగుమతి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రెండు రోజుల పాటు జరిగిన వర్చువల్ సమావేశంలో సౌదీ అదనంగా చమురు ఉత్పత్తి కోతలకు సిద్ధమని వెల్లడించింది. దీంతో ధరలు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.34 ఉండగా, డీజిల్ రూ. 80.88గా ఉంది.



Next Story

Most Viewed