రెండోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

by  |
రెండోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఇంధన ధరలు మైనస్‌లో ఉన్నప్పుడు ఇంధన కంపెనీలు ధరలను తగ్గించలేదు అయితే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయంటూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచుతున్నాయి. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన తర్వాత సోమవారం మళ్లీ లీటర్‌కు 60 పైసల చొప్పున పెంచేశాయి. గత 80 రోజులకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు చేయని ఆయిల్ కంపెనీలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించగానే ఇంధన వాడకం పెరుగుతుందనే అంచనాలతో రోజూ పెంచడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సోమవారం పెంచిన ధరలను ప్రకారం..పెట్రోల్ లీటర్ రూ.71.86 నుంచి రూ. 72.46కి చేరగా, డీజిల్ లీటర్‌కు రూ.69.99 నుంచి రూ. 70.59కి పెరిగింది. ఆదివారం కూడా ఈ స్థాయిలోనే ధరలను పెంచాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 75.22, డీజిల్ రూ. 69గా ఉంది.
* రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 72.46, డీజిల్ రూ. 70.59.
* ముంబైలో పెట్రోల్ రూ. 79.49, డీజిల్ రూ. 69.37.
* బెంగళూరు పెట్రోల్ రూ. 74.79, డీజిలి రూ. 67.14.
* చెన్నై పెట్రోల్ రూ. 76.60, డీజిల్ రూ. 69.25.

Next Story

Most Viewed