ప్రజలకు పట్టని సామాజిక దూరం

by  |
ప్రజలకు పట్టని సామాజిక దూరం
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా నియంత్రణకు సామాజిక దూరమే ఆయుధమని, ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెబుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ వద్ద బయట, లోపల కూడా ప్రజలు గుంపులుగా ఉండటం ప్రజల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అలా ఉంటే కేసులు పెడతామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా ప్రభుత్వ కార్యాలయంలోనే సామాజిక దూరం పాటించకుండా కనిపించడంతో పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం బయటే కాకుండా లోపల కూడా పదుల సంఖ్యలో ప్రజలు తోసుకోవడం జరిగింది. నియత్రించాల్సిన కార్యాలయం సిబ్బంది సైతం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారు.

Tags : People, social distance, post office, mahaboobnagar, office staff


Next Story

Most Viewed