హుజురాబాద్‌‌పై ఉత్కంఠ.. బుధవారం రాత్రి ఏం జరిగిందంటూ ఫోన్ కాల్స్..

155
Huzurabad

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు పొలిటికల్ పార్టీలనే కాదు.. సామాన్య జనంలో ఉత్సుకతను రేకిత్తిస్తున్నాయి. ఈ పరిస్థితి హుజురాబాద్ సమీప ప్రాంతాలవాసుల్లోనే కాదు.. ఇతర ప్రాంతాలవాసుల్లోనూ నెలకొంది. సమాజంలో ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న వారే కాకుండా సామాన్య జనం కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆతృతతో ఆరా తీస్తున్నారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత హుజురాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ.. ఇక్కడి ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం తెలుసుకుంటున్నారు.

నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలకు వివిధ ప్రాంతాల నుండి ఫోన్లు వస్తున్నట్టుగా సమాచారం. దీంతో హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు కేవలం పొలిటికల్ పార్టీలకే కాదు.. ఇతర ప్రాంతాల సామాన్య జనానికి కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రచార పర్వంలో అన్ని పార్టీల జెండాలు పట్టుకొని వేలాది మంది జనం హాజరయ్యారు. ప్రధాన పోటీగా ఉన్న బీజేపీ, టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే స్పందన కనిపించింది.

ఈ క్రమంలో ప్రజల నాడి ఎలా ఉందో అర్థం చేసుకోలేకపోయారు. దీంతో పాటు ప్రచారం ఎంత కాలం జరిగిందన్న విషయం కన్నా.. పోలింగ్‌కు ముందు రెండు మూడు రోజుల్లో జరిగే సమీకరణాలతో ఓటర్ల మనోగతం ఏంటో తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే ఇతర ప్రాంతాలకు చెందిన వారు హుజురాబాద్ వాసులకు తరుచూ ఫోన్లు చేస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..