ఆ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

by  |
karnataka narayanapur dam
X

దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుండి బుధవారం 45 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ అక్కడి అధికారులు గేట్లు ఎత్తి వేశారు. కర్ణాటక ప్రాంతంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నీరు చేరడం, అక్కడ డ్యాంకు మరమ్మతులు నిర్వహిస్తునందునా ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసింది. ఈ నీటి ప్రవాహం గురువారం సాయంత్రానికి గానీ రాత్రి వరకు గానీ జూరాల ప్రాజెక్టు కు చేరుకునే అవకాశం ఉంది.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అక్రమంగా ఉండాలని సంబంధిత ప్రాజెక్టుల అధికారులు సూచించారు. జూరాలలో మొత్తం 9.657 టీఎంసీల నీటికి గాను బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు 7.316 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్లు ఇప్పటికే సగం వరకు నిండాయి. నారాయణపూర్ డ్యామ్ నుండి విడుదల అవుతున్న నీటితో జూరాల మరోసారి పూర్తి స్థాయి మట్టం నిండుకోనుంది. మిగతా రిజర్వాయర్ లకు నీటిని ఎత్తిపోతల ద్వారా, కాలువల ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story

Most Viewed